JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Main Result 2022: తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలను NTA విడుదలచేసింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.

Update: 2022-07-11 05:28 GMT

తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదలచేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. నేరుగా jeemain.nta.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు రిజల్ట్స్ ను చూసుకోవచ్చు. అలాగే స్కోర్ కార్డును కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు జరిగాయి. ఈ నెల 6న ఫైనల్‌ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన ఫలితాలను మాత్రమే వెలువడ్డాయి. పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉంది.

ఇక జేఈఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్, కే.ధీరజ్, అనికేత్ చటోపాధ్యాయ, రూపేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థి యశ్వంత్ వంద పర్సంటైల్ సాధించారు.ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు



Tags:    

Similar News