LIC Recruitment 2022: టెన్త్ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలు.. జీతం రూ.25,000
LIC Recruitment 2022: ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.;
LIC Recruitment 2022: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ విభాగాల్లో ఉన్నాయి. స్త్రీ, పురుష అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.
ముఖ్య సమాచారం..
పోస్టులు : ఇన్సూరెన్స్ అడ్వైజర్
వయస్సు: 45 ఏళ్లు
విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం.
దరఖాస్తు విధానం: అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 24, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం: రూ.7000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది.