టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరింతమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేఆఫ్‌ల విషయాన్ని కంపెనీ ధ్రువీకరించినప్పటికీ ఎంత సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. 2022లో మెటా ఏకంగా 11వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గతేడాదిలో మరో 10వేల మందిని ఇంటికి పంపింది. తాజాగా మరో రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమైంది. అయితే ఈసారి తొలగింపులు తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మెటా నుంచి లేఆఫ్‌కు గురైనట్లు కొందరు ఉద్యోగులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.