Microsoft Recruitment 2022: ఇంజనీరింగ్ అర్హతతో మైక్రోసాప్ట్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. ఏడాదికి 5,00,000
Microsoft Recruitment 2022: ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాప్ట్ పలు విభాగాల్లో భర్తీకోసం ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.;
Microsoft Recruitment 2022: ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాప్ట్ పలు విభాగాల్లో భర్తీకోసం ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు: BE/B.Tech/ME/M.Tech
పాసౌట్ సంవత్సరం: 2022
స్థానం: బెంగళూరు, హైదరాబాద్, నోయిడా
జీతం: ఏడాదికి రూ.5 లక్షలు
అర్హత ప్రమాణం:
B. Tech / M. Tech / MS డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్‌లో కనీస CGPA 7.5/10. 2022 బ్యాచ్
విద్యార్ధులు కోడ్‌ను వ్రాయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
మార్పుకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
ప్రాజెక్ట్ బృందంలో అవసరమైనప్పుడు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలగాలి.
బాధ్యతలు..
కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం.
ప్రాజెక్ట్ ప్లానింగ్, స్కోపింగ్, ప్రాధాన్యతలో సహాయం, నాణ్యమైన కోడ్ రాయడం.
మైక్రోసాప్ట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి https://careers.microsoft.com/us/en/job/1072686/Software-Engineer-Full-Time-Opportunity లింక్‌పై క్లిక్ చేయాలి. వివరాలన్నీ చదివిన తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థి మైక్రోసాప్ట్, లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్, గూగుల్ లాగిన్ వివరాలతో లాగిన్ చేయాలి.
అభ్యర్ధి తన వివరాలతో ప్రొఫౌైల్ క్రియేట్ చేయాలి. విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఇతర వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. మైక్రోసాప్ట్ దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత అభ్యర్ధికి సమాచారం వస్తుంది. ఆ తర్వాత టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన వారికి హైదరాబాద్, బెంగళూరు, నోయిడాలోని మైక్రోసాప్ట్ కార్యాలయాల్లో పోస్టింగ్ లభిస్తుంది.
మైక్రోసాప్ట్ మాత్రమే కాదు ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ వేల సంఖ్యలో ఫ్రెషర్స్‌ని నియమించుకుంటున్నాయి. అవకాశాలు పెరిగిపోవడంతో సీనియర్లు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్నారు. దీంతో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఫ్రెషర్స్‌ని నియమించుకుని వారికి శిక్షణ ఇస్తున్నాయి కంపెనీలు.