Secunderabad AOC Recruitment 2022: డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.29,200 - 92,300.

Secunderabad AOC Recruitment 2022: సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.;

Update: 2022-11-16 05:53 GMT

Secunderabad AOC Recruitment 2022: సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 419 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుంది. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాలకు https://www.aocrecruitment.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్ 10, వెస్ట్రన్ 120, నార్తర్న్ 23, సదరన్ 32, సౌత్ వెస్ట్రన్ 23, సెంట్రల్ వెస్ట్ 185, సెంట్రల్ ఈస్ట్ 26 పోస్టులున్నాయి.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్/డిప్లొమా (మెటీరియల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: రూ.29,200 నుంచి రూ.92,300

ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం/స్కిల్ టెస్ట్: రాత పరీక్ష, ధ్రువపత్రాలు పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aocrecruitment.gov.in/

Tags:    

Similar News