SBI PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 'పీఓ' పోస్టులు.. జీతం రూ. 42020..
SBI PO Recruitment 2021:;
SBI PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 'పీఓ' పోస్టులు.. జీతం రూ. 42020..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,056 ప్రొబేషనరీ ఆఫీసర్స్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు అక్టోబర్ 25, 2021. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. అభ్యర్థి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ ట్రైనింగ్ నవంబర్ మధ్యవారంలో ఉంటుంది.
ఆన్‌లైన్ ప్రిలిమనరీ ఎగ్జామ్ డిసెంబర్ 2021 మొదటి లేదా రెండో వారంలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్ధులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. మరిన్ని వివరాలకు httpe://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం..
విద్యార్హతలు: అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: అభ్యర్థి వయసు 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్,ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 5, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 25, 2021
ఆన్‌లైన్ ప్రిలిమనరీ ఎగ్జామినేషన్: నవంబర్ లేదా డిసెంబర్
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 2021
ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి 2వ లేదా 3వ వారంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం
మొదట అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.in/careers లేదా https://bank.sbi/web/careers లను సందర్శించాలి.
అనంతరం నోటిఫికేషన్‌లో పొందుపరచిన అంశాలను మరోసారి జాగ్రత్తగా చదవాలి. తరువాత అప్లై లింక్ పై క్లిక్ చేయాలి.
దరఖాస్తు కోసం https://ibpsonline.ibps.in/sbiposasep21/లింక్ ఓపెన్ అవుతుంది.
న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకుని పేరు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.
దరఖాస్తు పూర్తయిన తరువాత ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.