EPFO : టెన్షన్ వద్దు..ఈపీఎఫ్‎వో పాస్‌బుక్‌లో లేటెస్ట్ ఎంట్రీస్ కనిపించకపోవడానికి కారణం ఇదే.

Update: 2025-11-27 06:45 GMT

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పాస్‌బుక్‌లో సెప్టెంబర్, అక్టోబర్ 2025 నెలల జీతాల ఎంట్రీలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆలస్యానికి గల కారణాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‎వో) స్పష్టం చేసింది. ప్రస్తుతం, అప్‌డేట్ చేయబడిన ECR(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) లెడ్జర్ పోస్టింగ్ సిస్టమ్ పనిచేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ కొత్త సిస్టమ్‌లోకి డేటాను అప్‌డేట్ చేస్తున్నందున, కొన్ని రోజుల పాటు మీ కాంట్రిబ్యూషన్స్ పాస్‌బుక్‌లో కనిపించకపోవచ్చు. ఈ తాత్కాలిక అసౌకర్యానికి ఈపీఎఫ్‎వో క్షమాపణలు చెబుతూ త్వరలోనే అన్ని ఎంట్రీలు సాధారణంగా కనిపిస్తాయని భరోసా ఇచ్చింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25% గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక అప్‌డేట్ గురించి మాట్లాడుకుంటే.. సెప్టెంబర్, అక్టోబర్ 2025 నెలల జీతాల ఎంట్రీలు కనిపించకపోవడానికి కారణం పాత ఈసీఆర్ విధానం నుంచి కొత్త సిస్టమ్‌కు మారుతున్నందునే. ఈ క్రమంలో జరిగే డేటా ప్రాసెసింగ్ కారణంగా ఆలస్యం జరుగుతోంది. అప్‌డేట్ పూర్తైన తర్వాత, సభ్యులు తమ ఈపీఎఫ్ ఎంట్రీలను UAN Member e-Sewa పోర్టల్ ద్వారా లేదా UMANG యాప్‌లో సాధారణ లాగిన్ , OTP విధానం ద్వారా సులభంగా చూసుకోవచ్చు. అంతేకాక ఈపీఎఫ్ఓ తన పోర్టల్‌లో Passbook Lite అనే కొత్త సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా సభ్యులు తమ బ్యాలెన్స్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఉద్యోగులు తమ EPF పాస్‌బుక్‌ను చెక్ చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయి. UAN Member e-Sewa పోర్టల్, UMANG యాప్. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో UAN, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి, OTP ద్వారా వెరిఫై చేసి, సభ్యత్వ ఐడీని ఎంచుకొని పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ క్లెయిమ్ (డబ్బులు విత్‌డ్రా) చేసుకోవడానికి కొన్ని షరతులు తప్పనిసరి. మీ UAN తప్పనిసరిగా ఆక్టివ్‌గా ఉండాలి. మీ ఆధార్ నెంబర్ ఈపీఎఫ్‎వో డేటాబేస్‌లో లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ వెరిఫికేషన్ కోసం OTP పనిచేయాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ వివరాలు కూడా అప్‌డేట్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఉద్యోగ కాలం 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం పాన్ కూడా లింక్ చేసి ఉండాలి.

Tags:    

Similar News