పదవతరగతి అర్హతతో అంగన్ వాడీ ఉద్యోగాలు..దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈ రోజే..
Telangana Anganwadi Jobs: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న 135 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.;
Emblem of Telangana Wikipedia
Anganwadi Jobs: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న 135 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూలై 15వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ. అభ్యర్ధులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్ధులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://mis.tgwdcw.in/ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 135
అంగన్‌వాడీ టీచర్లు: 36, అంగన్ వాడీ ఆయాలు: 83, మినీ అంగన్ వాడీ టీచర్లు: 16.
అర్హత: పదవ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి. అంతే కాకుండా స్థానికంగా గ్రామం అయితే గ్రామ పంచాయితీ పరిధిలో, పట్టణం అయితే స్థానిక మున్సిపాలిటీ వార్డులో నివసిస్తూ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.15,000-45,000/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15, 2021
వెబ్‌సైట్: https://mis.tgwdcw.in/
Also Read: నాన్న కాదు నరరూప రాక్షసుడు.. కూతురిని గర్భవతిని చేసి..