Python Web Development : లక్షల్లో జీతాలకోసం ఏం నేర్చుకోవాలో తెలుసా
భారీ జీతం ఇచ్చే టెక్ జాబ్ కోసం పైథాన్;
ఐటీ జాబ్ అనేది ఎవర్గ్రీన్ ఉద్యోగం అని పేరు. ఈ రంగంలో జీతాలు ఎక్కువగా వస్తాయని, త్వరగా అనుకున్న పొజిషన్లో ఉండచ్చు అని భావించేవారంతా ఎలాగైనా జాబ్ సంపాదించాలని కలలు కంటుంటారు. చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఇక ఐటి లో డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్యువేజ్గా పైథాన్ నిలిచింది. ఈ ప్రోగ్రామ్ సులభంగా ఉండటంతో చాలా మంది దీనిని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పైథాన్ వెబ్ అభివృద్ధిలో మాత్రమే కాకుండా అనేక ఇతర రంగాలలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అందుకే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పైథాన్‌కు మంచి డిమాండ్ ఉంది. వెబ్ డెవలప్మెంట్ నుంచి సాఫ్ట్వేర్ క్రియేషన్ వరకు, టాస్క్ ఆటోమేషన్ నుంచి డేటా ఎనలటిక్స్ వరకు అన్నింట్లోనూ పైథాన్‌ను ఉపయోగిస్తుంటారు. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగాల ఎంపికలో పైథాన్ సర్టిఫికేషన్‌ని కూడా చూస్తుంటాయి.
డేటా ఎనలిటిక్స్ లోని కష్టమైన లెక్కలను పైథాన్ ద్వారా సులభంగా సాల్వ్ చేసుకోవచ్చు. డేటా విజ్యువలైజేషన్, మెషిన్ లర్నింగ్ ఆల్గొరిథమ్లు వంటివి కూడా చేసుకోవచ్చు. ఆటోమేషన్‌లో కూడా పైథాన్‌ని చక్కగా వాడుకోవచ్చు. అంతేకాకుండా బగ్ ట్రాకింగ్, బిల్డింగ్ కంట్రోల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్‌లోనూ పైథాన్ ప్రోగ్రామ్‌ను వినియోగించుకోవచ్చు.
సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలన్న ఆసక్తి ఉండి, మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు పైథాన్ ప్రోగ్రామింగ్ పై దృష్టి పెట్టచ్చు. అందుబాటులో ఉన్న సర్టిఫికేషనల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు చాలా చోట్ల ఇందుకు అనువైన ఇన్స్టిట్యూట్ లు ఉన్నాయి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైపుణ్యాలు సాధించిన వారు ప్రాథమికంగా డెవలపర్ గా కెరీర్ ప్రారంభించవచ్చు. మంచి జీతాలు ఆర్జించవచ్చు.