తాగి హింసిస్తున్నాడని భర్తను చంపించిన భార్య
భార్య, బావమరుదులే షకిల్ ను చంపినట్లు విచారణలో వెళ్లడైంది. తమ సోదరిని రోజూ మద్యం తాగి హింసిస్తున్నందునే షకిల్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
కాన్పూర్ లో దారుణం జరిగింది. సోదరులతో కలిసి తన భర్తను చంపింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో జరిగింది. ఆపై... భర్త షకిల్ తప్పిపోయాడని ఏప్రిల్ 30న గోవిందపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతలోనే ఓ వ్యక్తి మృతదేహం పాండు నది ఒడ్డున పడి ఉందన్న సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు. ఆనవాళ్లనుబట్టి ఆ మృతదేహం షకిల్ దేనని అనుమానించిన పోలీసులు ఘటనా స్థలానికి షకిల్ భార్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె బోరుమంది.
అయితే హత్య ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారించగా షకిల్ భర్యపై, ఆమె సోదరులపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు షకిల్ బావమరుదులను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి. భార్య, బావమరుదులే షకిల్ ను చంపినట్లు విచారణలో వెళ్లడైంది. తమ సోదరిని రోజూ మద్యం తాగి హింసిస్తున్నందునే షకిల్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులుకు హత్య విషయం తెలిసిందని షకిల్ భర్యా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు అప్రమత్తమై షకిల్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆపై నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.