గుడ్ న్యూస్ చెప్పిన కర్ణాటక ప్రభుత్వం

కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆంక్షలను సడలిస్తూ

Update: 2020-08-25 05:31 GMT

కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రయాణ రాకపోకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆంక్షలను సడలిస్తూ యడియూరప్ప ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సడలింపుల్లో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకు విధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక వెళ్లాలనుకునేవారు ఇకపై 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అయితే లక్షణాలు ఉన్నవారు మాత్రం హోం క్వారంటైన్ లో ఉండి ఆప్తమిత్ర హెల్ప్ లైన్ నంబర్ 14410కి ఫోన్ చేయడం ద్వారా గానీ, వైద్యులను సంప్రదించి గానీ చికిత్స పొందాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు సేవా సింధు పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వివరాలేవీ నమోదు చేయనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి ఇప్పటివరకు తప్పనిసరిగా చేసిన కరోనా టెస్టులను కూడా ఇకపై చేయనవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనాకు సంబంధించిన అన్ని ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. 




Tags:    

Similar News