ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈరోజు, రేపు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని India Meteorological Department (IMD) తెలిపింది. సోమవారం ఢిల్లీ-NCR ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య, తూర్పు భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షపాతం కూడా ఉంటుందని తెలిపింది దేశంలోని అనేక నగరాలలో వర్షాలు నమోదుకానున్నాయని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది.
ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతో పాటు ఈదురు గాలులు, వడగళ్ల వాన కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట , కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 26 డిగ్రీల సెల్సియస్, 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిశాయి, ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని IMD తెలిపింది.
"మార్చి 20న వర్షపాతం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సోమవారం వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది" అని IMDప్రాంతీయ అంచనా కేంద్రం అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ చెప్పారు.