చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించింది. దీంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు ప్రకటించలేదు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిక్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాల్టి నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి.
మొత్తం రకాల పొదుపు పథకాలను గాను..... పది పథకాలపై వడ్డీ రేటను 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకు పెంచింది. రెండేళ్లు, మూడేళ్ల డిపాజిట్ 0.1 శాతం ... ఏడాది డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం 0.2 శాతం,నెలవారీ ఆదాయ ఖాతాస్కీం 0.3శాతం, అయిదేళ్ల రికరింగ్ డిపాజిట్ 0.4 శాతం, అయిదేళ్ల డిపాజిట్ 0.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంపై అత్యధికంగా 0.7 శాతం మేర వడ్డి పెరిగింది.