సీఎం కార్యాలయంలో పది మందికి కరోనా
కరోనా మహహ్మరి ఎవరినీ వదలడం లేదు. అన్ని వర్గాలను కలవరపెడుతుంది.;
కరోనా మహహ్మరి ఎవరినీ వదలడం లేదు. అన్ని వర్గాలను కలవరపెడుతుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కార్యాలయంలో పది మందికి కరోనా సోకింది. సీఎం ఆఫీసుతో పాటు.. అధికార నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న వారిలో పది మందికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయ్యింది. దీంతో సీఎం తన అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన వారితో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని సీఎం కార్యాలయం ప్రకటించింది. కాగా.. రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 74 వేలు దాటగా ఇప్పటి వరకు 992 మంది మరణించారు.