గోవా ఆరోగ్యశాఖ డైరక్టర్‌కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది.;
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకూ ఎవరినీ విడిచి పెట్టడం లేదు. తాజాగా గోవా ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జోస్ డిసా కరోనా బారినపడ్డారు. ఈ రోజు ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రసుత్తం ఆయన కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.