Crime : హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పులు

Update: 2023-04-05 03:23 GMT

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. టపాచబుత్రలో ఆకాష్‌సింగ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనలో ఆకాష్‌ సింగ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ నేత అమర్‌సింగ్‌ అల్లుడు ఆకాష్‌గా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. గన్‌తోపాటు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షల వల్లే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News