Toyota Hilux vs Isuzu V-Cross : టయోటా హిలక్స్ వర్సెస్ ఇసుజు వీ-క్రాస్.. మీ ఛాయిస్ ఏది ?

Update: 2026-02-26 10:45 GMT

Toyota Hilux vs Isuzu V-Cross : భారతదేశంలో అడ్వెంచర్ వాహనాలకు, ఆఫ్-రోడ్ పిక్-అప్ ట్రక్కులకు క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఈ విభాగంలో ఇసుజు తన సరికొత్త మోడల్ ఇయర్ 2026 వీ-క్రాస్ మోడల్‌ను విడుదల చేయడంతో మార్కెట్లో పోటీ వేడెక్కింది. ఆధునిక డిజైన్, 360-డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన వీ-క్రాస్, నేరుగా టయోటా హిలక్స్‎కు సవాల్ విసురుతోంది. ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్? ఏది తక్కువ ధరకు ఎక్కువ విలువను ఇస్తుందో ఇక్కడ వివరంగా చూద్దాం.

కొలతల్లో ఏది పెద్దది?

వీటి మీడియం సైజులో స్వల్ప తేడాలు ఉన్నాయి. వెడల్పు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, ఎత్తు, వీల్‌బేస్ విషయంలో వీ-క్రాస్ ముందంజలో ఉంది. ఇసుజు వీ-క్రాస్ హిలక్స్ కంటే 40 మిమీ ఎత్తుగా ఉంటుంది. అయితే, పొడవు విషయానికి వస్తే టయోటా హిలక్స్ 30 మిమీ ఎక్కువగా ఉంటుంది. పొడవైన వీల్‌బేస్ (3,095 మిమీ) కావాలనుకునే వారికి వీ-క్రాస్ మంచి ఆప్షన్.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్

రెండూ డీజిల్ ఇంజిన్లే అయినప్పటికీ, పవర్ విషయంలో హిలక్స్ చాలా పవర్‌ఫుల్. హిలక్స్‌లో 2.8 లీటర్ల పెద్ద ఇంజిన్ ఉండటం వల్ల ఇది 204 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది వీ-క్రాస్ కంటే 41 హెచ్‌పి పవర్, 140 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ. రెండింటిలోనూ 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు, 4WD సెటప్ అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్లు, సేఫ్టీ

ఎక్స్‌టీరియర్: హిలక్స్‌లో పూర్తి స్థాయి ఎల్‌ఈడీ లైటింగ్ ఉండగా, వీ-క్రాస్ ఫోగ్, టెయిల్ ల్యాంప్స్ కోసం హాలోజన్ బల్బులను వాడుతోంది. అయితే, వీ-క్రాస్‌లో రూఫ్ రైల్స్, సైడ్ స్టెప్స్ కంపెనీ నుండే వస్తాయి.

ఇంటీరియర్: వీ-క్రాస్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, ఎనిమిది స్పీకర్లు ఉన్నాయి. హిలక్స్‌లో డ్యూయల్-జోన్ ఏసీ, కూల్డ్ గ్లోవ్ బాక్స్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి.

సేఫ్టీ: హిలక్స్ అన్ని వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చి సేఫ్టీలో రాజీ పడలేదు. వీ-క్రాస్ టాప్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి, కానీ ఇందులో హిలక్స్ లో లేని 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణ.

ధర పరంగా చూస్తే ఇసుజు వీ-క్రాస్ చాలా సరసమైనది. దీని ప్రారంభ ధర రూ.25.50 లక్షలు కాగా, హిలక్స్ ధర రూ.28.02 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ ఎండ్ మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం ఏకంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. మీకు బ్రాండ్ విలువ, పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలంటే హిలక్స్ బెస్ట్. కానీ, బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, మంచి ఆఫ్-రోడ్ కెపాసిటీ కావాలనుకుంటే వీ-క్రాస్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags:    

Similar News