ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతోంది. సుమారు ఐదు గంటలుగా కేజ్రీవాల్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఆర్పీసీ 161 కింద.. సాక్షి గానే కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. స్కామ్‌లో సాక్షులు, నిందితు లు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్‌ను క్వశ్చన్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, కమీషన్ రేట్లను పెంచడం, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి మంత్రివర్గం ఆమోదం, సౌత్ గ్రూప్‌తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్నారు.