కుక్కల బెడదపై GHMCకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 36 గంటల్లోనే దాదాపు 15వేల ఫిర్యాదులు అందాయి.. అంటే కుక్కలపై గంటకు 416 కంప్లైంట్స్ వస్తున్నాయన్న మాట. అయితే రోజుకు మూడువందల ఫిర్యాదులు మాత్రమే పరిష్కరిస్తామంటున్నారు GHMC అధికారులు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
రోజుకు 150 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు GHMC వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులు. మరోవైపు గ్రేటర్ పరిధిలో చేయాల్సిన కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయాల్సిన కుక్కల సంఖ్య లక్షా అరవై వేలకు పైగా ఉండగా.. రోజుకు కేవలం 150 కుక్కలకే చేస్తే మొత్తం కుక్కులకు చేయాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది.