తీవ్రమైన కోమాలో ప్రణబ్ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ అండ్ రిఫరల్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.;
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ అండ్ రిఫరల్ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన తీవ్రమైన కోమాలో ఉన్నారని ప్రకటించింది. ఆయన ఇప్పటికీ కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ప్రణబ్ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని, చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. ఆయన రెనల్ పెరామీటర్స్ కొద్దిగా క్రమం తప్పినట్లు సమాచారం ఇచ్చారు. కాగా.. ఆయనకు ఆర్మీ హాస్పిటల్లో ఈ నెల 10న బ్రెయిన్ సర్జరీ జరిగింది.