రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతిచెందారు. ఈ ఘటన పంజాబ్ లోని తరణ్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఫిరోజ్ పూర్ సమీపంలో ప్రభుత్వ టీచర్లు ప్రయాణిస్తున్న వెహికిల్ ను బస్సు ఢీకొంది. నలుగురు మరణించగా అందులో ముగ్గురు టీచర్లు ఉన్నారు. తరణ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించేందుకు 13మంది ఉపాద్యాయులు ల్యాండ్ క్రూయిజర్ కారులో ప్రయాణిస్తున్నారు. ఖాయ్ ఫేమ్ కీ గ్రామ సరిహద్దులో ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఫిరోజ్ పూర్ నుంచి 8కిమీల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉపాద్యాయులు అక్కడికక్కడే మృతిచెందగా 10మంది టీచర్లు గాయపడ్డారు. ఫిరోజ్ పూర్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ ధీమన్ గాయపడిన ఉపాధ్యాయులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.