TS : ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి నాలుగు పులులు

Update: 2023-02-25 07:32 GMT

ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి నాలుగు పులుల సంచారం స్థానికంగా భయాందోళన రేపుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి పెన్‌ గంగను దాటి.. భీంపూర్‌ మండలంలోకి పులులు ప్రవేశించాయి. గతేడాది నవంబర్‌లో ఇదే ప్రాంతానికి… తన మూడు పిల్లలతో కలిసి కొన్ని రోజుల పాటు హల్‌చల్‌ చేసిన ఆడ పులిగా భావిస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు. ప్రస్తుతం పిప్పల్‌ కోటి రిజర్వాయర్‌, తాంసి-కె, గొల్లఘాట్‌ శివారులో ఈ నాలుగు పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. 

Similar News