TS : షర్మిల కొత్త రాజకీయం

Update: 2023-04-05 03:45 GMT

తెలంగాణ రాజకీయాల్లో కొత్త దృశ్యాలు కనబడుతున్నాయి. ఒక పార్టీ మరో పార్టీని విమర్శించుకోవడం కామన్‌గా జరిగేదే.. అయితే, ఈ మధ్య కాలంలో విచిత్ర ధోరణి కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ ఆఫీసుకు వెళ్లి వారి ముందే విమర్శలు గుప్పించడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త పోడకలను గుర్తు చేస్తోంది. కొశ్చన్‌ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై పోరాటానికి కలసి రావాలని కోరేందుకు విపక్ష పార్టీల తలుపులు తడుతున్నారు షర్మిల. ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.

అయితే.. ఈ భేటీకి ముందు మీట్‌ ది ప్రెస్‌లో తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టే పోరా టాల్లో షర్మిల కలిసి రావడం లేదని అన్నారు. దీని వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ డ్రామాలు ఇక ఆపాలంటూ హా ట్‌ కామెంట్స్‌ చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ.. బీజేపీకి బీ-టీమ్‌ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు సీపీఎం కార్యాలయంలో భేటీ అనంతరం తమ్మినేని వీరభద్రం, షర్మిల మీడియా ముందుకు వచ్చారు. బీఆర్‌ఎస్‌కు సీపీఎం బీ-టీమ్‌ అంటూ తమ్మినేని ముందే షర్మిల కామెంట్స్‌ చేశారు. తమకు బీజేపీతో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశా రు. బీఆర్‌ఎస్‌కి బీ-టీమ్‌గా వామపక్షాలు పనిచేస్తున్నాయని విమర్శించారు.  

Similar News