TS : ఖమ్మంను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా : మంత్రి పువ్వాడ

Update: 2023-02-25 07:09 GMT

ఖమ్మంను తెలంగాణలో నెంబర్‌ వన్‌గా తీర్చదిద్దడమే తన లక్ష్యం అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 50వ డివిజన్ లో అయన పర్యటించారు.డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అత్యధిక సంఖ్యలో స్ధానిక ప్రజలు తమకు రోడ్లు, సైడ్ డ్రెయిన్లు కావాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడం కాకుండా వీధి దీపాలు కూడా వెలగట్లేదు అని, మరి కొన్ని చోట్ల అసలు దీపాలే లేవని వివరించారు. కాల్వ నీరు రోడ్డు పైకి వస్తుందని ప్రజల ఫిర్యాదు మేరకు కల్వర్టు నిర్మాణంకై ప్రతిపాదనలు చేసి నిర్మించాలని ఆదేశించారు.

Similar News