సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 62వ రోజు జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది. నవాబుపేట మండలం కొల్లూరు నుంచి యాత్రను ప్రారంభించారు. మార్గ మధ్యలో భట్టి విక్రమార్క రైతులు, ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు పంచిన భూములను లాక్కొని బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు భూములు తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పటి వరకు చుక్క నీరందలేదన్నారు.