Uttarpradesh : లోయలో పడ్డ పెళ్లి బస్సు.. ఐదుగురు మృతి

Update: 2023-05-07 08:52 GMT

యూపీ గోపాల్‌ పురాలో విషాదం నెలకొంది.పెళ్లి బృందం బస్సు లోయలో పడ్డ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదంలో వరుడి బావ మరిదికి తీవ్ర గాయాలు అయ్యాయి.పలువురి పరిస్థతి విషమంగా ఉంది. ఘటనతో గోపాల్‌ పురా ప్రాంతంలో విషాద చాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హుజూర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురైని గ్రామానికి చెందిన మన్షారామ్ ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు బంధువులు హాజరయ్యారు.వేడుక ముగిశాక స్వగ్రామానికి వెళ్లే సమయంలో ప్రమాదం జరిగింది. మృతదేహాలతో, క్షతగాత్రులతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. తీవ్ర గాయాలతో బాధితులు ఆర్తనాదాలు పెట్టారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు.

Similar News