మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ పెరిగిన ధరలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి.;
పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ పెరిగిన ధరలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజువారీ చమురు ధరల సమీక్షలో భాగంగా ప్రభుత్వంరంగ సంస్థలు పెట్రోల్ ధరలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.81.49కి చేరింది. శనివారం పెట్రోల్ ధర రూ.81.35గా ఉంది. అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.73.56గా ఉంది. అయితే రాష్ట్రాల్లో పన్నులు ఒక్కోవిధంగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.