తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం!
సోమ, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం;
తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది.
ఇటీవల ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.