కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అదే: ఐసీఎంఆర్

Update: 2020-08-25 16:09 GMT

కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడమేనని ఐసీఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దవాళ్లా? పిల్లల్లా? అనే విషయం పక్కన పెడితే.. కరోనా అంటే కనీషం భయం లేకుండా మాస్కులు కూడా లేకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఐసీఎమ్‌ఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ మండిపడ్డారు. అలాంటి వారి వలనే ఈ మహమ్మారి విజృంభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రస్తుతానికి దేశంలో మూడు కరోనా వ్యాక్సీన్ల ప్రయోగాలు ముందంజలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

Tags:    

Similar News