Rajkumar Rao : చోరబజార్‌లో రూ.100 జాకెట్ కొన్న.. అందుకే నుదుటన సింధూరం పెట్టుకున్న..
Rajkumar Rao : సినిమా ఇండస్ట్రీకి రాకముందు అనేక మంది సూపర్ స్టార్లు చాలా కష్టాలను అనుభవించారు.;
Rajkumar Rao : సినిమా ఇండస్ట్రీకి రాకముందు అనేక మంది సూపర్ స్టార్లు చాలా కష్టాలను అనుభవించారు. మంచి అవకాశాలు వచ్చిన తరువాత ఆ జ్ణాపకాలను అప్పుడుప్పుడు ఇంటర్వ్యుల్లో పంచుకొంటూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు అప్పటి తన జ్ణాపకాలను పంచుకున్నారు.
టెన్త్ క్లాస్ ఫేర్‌వెల్ పార్టీకి హాజరుకావాల్సి ఉంది. అప్పుడు చేతిలో డబ్బులు లేవు. ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉండేవి. పార్టీలో ఓ ప్రదర్శన కూడా ఇచ్చేదుంది. ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితిలో ఢిల్లీ చోర్ బజార్‌కు వెళ్లా.. అక్కడ రూ.100 టీషర్టు, రూ.15 చైన్ కొని పార్టీకి అటెండ్ అయ్యానని రాజ్‌కుమార్ రావు భావోద్వేగంగా చప్పారు.
తన పెళ్లప్పుడు తాను కూడా నుదుటున సింధూరం పెట్టుకోవడం గురించి క్లారిటీ ఇచ్చారు. అది అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అన్నారు. స్త్రీపురుషులిద్దరూ సమానం అన్నప్పుడు పురుషుడెందుకు నుదుటన కుంకుమ పెట్టుకోవద్దని అనిపించింది. నా నుదుటన కూడా సింధూరం పెట్టమని నేనే లేఖకు చెప్పానని చెప్పుకొచ్చారు.