Aadavallu Meeku Joharlu Review: 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. సీనియర్ నటీమణుల సినిమా..

Aadavallu Meeku Joharlu Review: రాధికా, ఊర్వశి, ఖుష్బును ఒకే సినిమాలో చూడడం ఆడవాళ్లు మీకు జోహార్లుకు ప్లస్ పాయింట్‌.

Update: 2022-03-04 03:42 GMT

Aadavallu Meeku Joharlu Review: మార్చిలో సినిమా సందడి మొదలయ్యింది. మార్చి మొదటి వారంలో ఇప్పటికే డబ్బింగ్ సినిమా అయిన 'హే సినామికా' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక శుక్రవారం సినిమా సందడిని తన సినిమాతో ప్రారంభించాడు శర్వానంద్. శర్వానంద్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నేడు విడుదలయ్యి పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంటోంది.

ఫ్యామిలీ సినిమాలతో ఆడియన్స్‌తో దగ్గరయ్యాడు కిషోర్ తిరుమల. తన సినిమాలన్నీ చాలావరకు ఆడియన్స్ కాసేపు చూసి నవ్వుకునేలానే ఉంటాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా అదే కేటాగిరికి చెందుతుంది. ఈ మూవీ కోసం ముగ్గురు సీనియర్ హీరోయిన్లను రంగంలోకి దింపిన కిషోర్.. వారందరికీ సమానంగా ప్రాధాన్యత ఇచ్చి ఆకట్టుకున్నాడు.


కథ..

రాధికా శరత్‌కుమార్, ఊర్వశి వల్ల శర్వానంద్ (చిరు) పెళ్లి కాకుండా బ్యాచిలర్‌గా ఉంటాడు. అదే సమయంలో చిరుకు ఆద్య (రష్మిక మందన్నా) ఎదురుపడుతుంది. క్రమంగా ఆద్య మీద ఇష్టం పెరిగి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు చిరు. కానీ ఆద్య తల్లిగా నటించిన ఖుష్భూకు మాత్రం పెళ్లి పడదు. దీంతో చిరు.. ఆద్యను, వారి కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించాడు, ఎలా ఆద్యను దక్కించుకున్నాడు అనేది కథ.

రాధికా, ఊర్వశి, ఖుష్బు లాంటి సీనియర్ హీరోయిన్లను ఒకే సినిమాలో చూడడం ఆడవాళ్లు మీకు జోహార్లుకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. బోర్ కొట్టని కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్. ఇందులో ఎవరి పాత్రలో వారు ఒదిగిపోవడం, అన్ని పాత్రలకు సమానంగా ప్రాధాన్యత దక్కడం లాంటి విషయాలను చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు కిషోర్ తిరుమల.


ఇక ఇన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా.. శర్వానంద్, దేవీ శ్రీ ప్రసాద్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు.. మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. అన్నిటికంటే ఎక్కువగా ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రాఫీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News