రివ్యూ : ఆంధ్రా కింగ్ తాలూకా
ఆర్టిస్ట్స్ : రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, రావు రమేష్, సత్య తదితరులు
ఎడిటర్ : ఏ శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని, జార్జ్ సి విలియమ్స్
సంగీతం : వివేక్ - మెర్విన్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్
దర్శకత్వం : మహేష్ బాబు పచ్చిగొల్ల
2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత మంచి విజయం చూడలేదు రామ్ పోతినేని. ఆ తర్వాత రెడ్, ద వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ తో ఫ్లాప్స్ చూశాడు. బట్ ఈ యేడాది ఆంధ్రాకింగ్ తాలూకాతో పాజిటివ్ టాక్ చూడబోతున్నాం అనిపించేలా కనిపించాడు. మంచి ఎనర్జిటిక్ ప్రమోషన్స్ చేశాడు. ఈ మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూవీతో రామ్ ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో చూద్దాం.
కథ :
సూర్య (ఉపేంద్ర) ఓ స్టార్ హీరో. అతనికి 100వ సినిమా చేయబోతున్నాడు. అంతకు ముందే 9 సినిమాలు వరుసగా పోతాయి అతనికి. దీంతో 100వ సినిమా నిర్మాత సగం సినిమా తీసి ఆగిపోతాడు. మరో మూడు కోట్లు పెడితే హీరోకు 100వ సినిమా అయిపోతుంది. సినిమా ఆగిపోతుంది. సాగర్ (రామ్ పోతినేని) ఒక పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్. అతనికి స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర) అంటే చిన్నతనం విపరీతమైన అభిమాని. అతని అభిమాన సినిమాలు అంటే ప్రాణం పెడుతున్నాడు. అతనితో పాటు మహాలక్ష్మి(భాగ్యశ్రీ బోర్సే) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ నచ్చని మహాలక్ష్మి అతన్ని అవమానిస్తాడు. దీంతో తనూ కోపం పెంచుకుని అతన్లా ఓ థియేటర్ కట్టిస్తాను అనే ఛాలెంజ్ చేస్తాడు. మరోవైపు సూర్య మూడు కోట్లు అతనికి వచ్చాయి..? సాగర్ లవ్ స్టోరీ ఏమౌతుంది అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
రామ్ ఈ సినిమాపై ఎంత నమ్మకం పెట్టాడో అని ముందు నుంచీ తెలుస్తోంది. ప్రమోషన్స్ లో అతనికి బాగా తెలుస్తూ వచ్చింది. అది నిజం అనిపించేలా ఉంది ఆంధ్రాకింగ్ తాలూకా మూవీ. రామ్ కథల్లో కెరీర్లో ఎప్పుడూ నేల మీద సాగలేదు. బట్ ఈ సారి అది కనిపిస్తుంది. కథ పక్కాగా ఉంది. అతని కథ నేలపైనే కనిపిస్తుంది అనిపించేలా ఉంది. 2000 యేడాదిలో సాగే కథలాగా నడిపించాడు. అంతకు ముందే అతనికి పుట్టి ఉంటాడు రామ్. అయితే అతని ఊరు ఒక లంకలా ఉంటుంది. చుట్టూ నది ఉంటుంది. నది మధ్యలో కనిపిస్తుంది. అలాంటి ఊరు నుంచి మొదటగా చదువుకున్న కుర్రాడుగా కనిపించాడు రామ్. అందుకు తగ్గట్టుగా అతని క్యారెక్టర్ కనిపిస్తుంది. హీరో పాత్ర విధానం నేచురల్ గా మలిచాడు దర్శకుడు. హీరోయిన్ తో ప్రేమలో పడే విధానం కూడా సహజంగా కనిపిస్తుంది. అప్పటికే చిన్నతనం నుంచే తను హీరోతో ప్రేమలో పడిన విధానం కూడా చాలా సహజంగా కనిపిస్తాడు. దీంతో ఆ హీరోతోనే అతని లైఫ్ మొత్తం ప్రయాణం కనిపిస్తుంది. కానీ హీరోనే అతని కోసం ప్రయాణం సాగించాడు అనే తీరు మాత్రం గొప్పగా రాసుకున్నాడు దర్శకుడు. హీరో పాత్ర గొప్పగా కనిపిస్తుంది. కానీ హీరో కోసం అభిమాని అంతకంటే గొప్పగా కనిపించేలా ఉన్నాడు. ఆఖరికి తన ప్రియురాలు కూడా వదులుకునేంత గొప్పగా అభిమానిగా కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. హీరో తనకు మూడు కోట్లు చెల్లించే అవకాశం ఉన్న అభిమాని కోసం సాగించిన ప్రయాణంగా మాత్రం కనిపిస్తుంది సినిమాలో. కానీ అభిమాని తీరు గొప్పగా ఉంటుంది. ఆ గొప్పదనం అవకాశం వచ్చేలా చూసుకున్నాడు అభిమాని. సింపుల్ గా ఆ హీరో ఇబ్బందుల్లో పడటం వల్ల అభిమాని చేసిన సాయం గొప్పగా మలిచిన విధానం కనిపించినా చివర్లో నది పొంగడం.. ఆ నదిలో హీరో ప్రయాణం సాగించిన తీరు ఆకట్టుకుంది. పాజిటివ్ నోట్ తో సాగే తో సాగే కథనం చాలా బావుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమాగా కాస్త స్లోగా కనిపిస్తుంది. అక్కడక్కడా ఉపయోగం లేని సన్నివేశాలు కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో హీరో సాగించిన సినిమా థియేటర్ జర్నీ ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉంటే బావుండు అనిపిస్తుంది.
సాగర్ గా రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. తన కెరీర్ లో బెస్ట్ రోల్ గా చెప్పొచ్చు. అతని నటన కూడా అదిరిపోయేలా ఉంది. హీరో పాత్రలో ఉపేంద్ర గురించి ఎంత తక్కువ చెప్పినా అనిపించేలా ఉంది. అద్భుతంగా ఆకట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సే పాత్ర చాలా సహజంగా ఉంది. స్కిన్ షోకు దూరంగా ఆకట్టుకుంది. రావు రమేష్, మురళీ శర్మ పాత్రలు బావున్నాయి. రాహుల్ రామకృష్ణ ప్రభావం చూపించే పాత్ర. మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఒకే.
టెక్నికల్ గా :
నేపథ్య సంగీతం బావుంది. పాటలూ ఒకట్రెండు బావున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్ అనిపిస్తుంది. రెట్రో లుక్ లో కనిపించేలా ఉంది. ఎడిటింగ్ పరంగా నిడివి పెరిగిన భావన కలుగుతుంది. డైలాగ్స్ ఓకే. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఆర్ట్ వర్క్ బావుంది. నది పొంగడం వరకు విజువల్ ఎఫెక్ట్స్ వరకు బావుంది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు మహేష్ బాబు రచనలో మెప్పించాడు. దర్శకత్వంతో మెప్పించాడు. కొన్ని మైనస్ లు ఉన్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు.
ఫైనల్ గా : ఆంధ్రాకింగ్ తాలూకా .. సూపర్ హిట్
రేటింగ్ : 3/5
బాబురావు. కామళ్ల