Beast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా అదుర్స్..

Beast Movie Review: ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ పాజిటివ్ రివ్యూలతో షోలను మొదలుపెట్టింది.

Update: 2022-04-13 03:35 GMT

Beast Movie Review: తమిళ స్టార్ హీరో విజయ్ గత కొన్నేళ్లుగా ఫ్లాన్ అనే మాట లేకుండా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ప్రతీ సినిమాలో విజయ్ యాక్టింగే హైలెట్‌గా నిలుస్తోంది. 'బీస్ట్'లో కూడా అంతే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన బీస్ట్.. ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో బీస్ట్ షోలు మొదలయ్యాయి.

కథ..

వీర రాఘవన్ (విజయ్) ఒక రా ఏజెంట్. కానీ తన వృత్తి గురించి బయటపెట్టకుండా ఓ మాల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజు ఆ మాల్‌లో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. ఆ టెర్రరిస్ట్ అటాక్ నుండి ప్రజలను చాకచక్యంగా కాపాడతాడు వీర. ఆ తర్వాత వీరకు, టెర్రరిస్టులకు మధ్య జరిగే థ్రిల్లర్ యాక్షన్‌తో కథ కొనసాగుతుంది. ఈ సినిమా ప్రీతిగా కనిపించింది పూజా హెగ్డే.

విశ్లేషణ..

వీరకు, టెర్రరిస్టులకు మధ్య వచ్చే సీన్లు యాక్షన్‌తో నిండిపోయి ఎంటర్‌టైన్ చేస్తాయి. పైగా ఇంత సీరియస్ సినిమాలో కామెడీ సీన్స్‌కు పండించాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇక విజయ్ తెరపైకి ఎప్పుడు వచ్చినా.. ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. అరబిక్ కుతు పాట ఫస్ట్ హాఫ్‌నే నిలబెట్టేలా ఉంటుంది. అనురుధ్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పూజా హెగ్డే పాటల్లో గ్లామర్ వరకే పరిమితమయ్యింది.


Tags:    

Similar News