REVIEW: "బర్డ్ బాక్స్ బార్సిలోనా" ఆకట్టుకుందా...

బర్డ్‌బాక్స్‌ బార్సిలోనా భయపెట్టిందా...

Update: 2023-07-15 03:00 GMT

ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన హాలివుడ్‌ చిత్రం బర్డ్‌ బాక్స్‌(Bird Box). ఈ సిరీస్‌లో ఇప్పుడు రెండో భాగం విడుదలైంది. భయం, క్షణ క్షణం ఉత్కంఠతో మొదటి భాగం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి బర్డ్‌ బాక్స్‌ బార్సిలోనా(Bird Box Barcelona) పేరుతో నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో విడుదలైన రెండో భాగం ఎలా ఉందంటే....


బర్డ్‌ బాక్స్‌‍(Bird Box 2018)లానే బర్డ్‌బాక్స్‌ బార్సిలోనా కూడా భయం, అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవాలన్న పోరాటం చుట్టూనే కథ నడుస్తుంది. విచిత్రమైన జీవులు ఎక్కడి నుంచో భూమి మీదకు దిగుతాయి. వాటిని చూసే మనుషులన మెదడును మార్చి... వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాయి. వీటి నుంచి బయట పడటానికి కథనాయకుడు చేసిన పోరాటమే బర్డ్‌ బాక్స్‌ కథ..


2018లో బర్డ్‌బాక్స్‌(Bird Box Barcelona review) తొలి సినిమా విడుదలై విజయవంతమైంది. ఐదు సంవత్సరాల తరువాత... డైరెక్టర్లు డేవిడ్ పాస్టర్, అలెక్స్ పాస్టర్... బర్డ్ బాక్స్ బార్సిలోనా ద్వారా ఆ భయానక వాతావరణాన్ని మళ్లీ సృష్టించేందుకు ప్రయత్నించారు. అపోకలిప్స్ జాతి... మానవజాతిని ఎలా మారుస్తుందనదే సినిమా ప్రధాన ఇతివృత్తం. మనుగడ కోసం మానవులు చేసే యుద్ధం ఇది. తొలి భాగంలో సగం ధ్వంసమైన బార్సిలోనా నగరంలో సెబాస్టియన్, అతని కుమార్తె అన్నాను చూపిస్తూ సినిమా రెండో భాగం ప్రారంభమవుతుంది. తొలి భాగంలో అతీంద్రియ శక్తులను చూసిన వారు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ఇందులో మరికొందరు ఇతరుల ప్రాణాలను తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ప్రాణాలతో బయటపడేందుకు పోరాటం చేసే సమూహంలో సెబాస్టియన్ చేరుతాడు. వారందరినీ సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళతానని హామీ ఇస్తాడు. ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ఆ సమూహం ఎలా ఎదుర్కొంటుది అన్నదే మిగతా కథ.

మారియో కాసాస్, సెబాస్టియన్ మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి మానసిక పరిస్థితులను హృద్యంగా చూపించారు. అద్భుతమైన నటలు, సినిమాటోగ్రఫీ ఉన్నా ఈ చిత్రం భయాన్ని కలిగించడంలో మాత్రం తొలి భాగమంతా విజయవంతం కాలేదనే చెప్పాలి. కథేంటో సినిమా స్టార్టింగ్‌లోనే తెలియడంతో ఇక సస్పెన్స్ ఏమీ ఉండదు. ఈ సిరీస్‌లోని భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వరు. చీకటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే... మీరు ఎవరిని నమ్మగలరో తెలియకపోవడం అన్న డైలాగులు ఆలోచింపజేస్తాయి. కానీ ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. క్లైమాక్స్ కొంత ఉత్సుకత రేకెత్తిస్తుంది. కథ ఇంకా పూర్తి కాలేదనే విధంగా పతాక సన్నివేశాలు ఉండడంతో ఈ సిరీస్‌లో మరో సినిమా వచ్చే అవకాశం కూడా ఉంది.

Tags:    

Similar News