ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో 18 మంది నక్సల్స్ మృతి చెందారు. ఒక జవాను గాయపడ్డారు. మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లకు గా యాలయ్యాయి. కాంకేర్ జిల్లాలో కోరోస్ కోడో గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్- దంతేవాడ జిల్లాల బోర్డర్ లోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావో యిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో నక్సల్స్ ఎదురుపడి కాల్పులకు తె గబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పు లు జరిపాయని అధికారులు తెలిపారు. ఈ కా ల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఘటనాస్థలిలోని 18 మంది నక్స ల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నా రు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. 2025లో ఇప్పటి వరకు 71 మంది నక్సల్స్ ఎన్ కౌంటర్లలో మరణించారని పోలీసులు తెలిపారు. గత ఏడాది 300 మంది నక్సల్స్ వివిధ ఎన్ కౌంటర్లలో హత మార్చామని వెల్లడించారు. 290 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేవాడ సరిహద్దులో మావోయిస్టుల సమావేశమైనట్టు కచ్చితమైన సమాచారంతో కూంబింగ్ నిర్వహించగా మా వోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో డీఆర్జీ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు. ఎన్ కౌంటర్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారం తెలుపు తామని అన్నారు. హీరోలీ ప్రాంతం నుంచి మరికొంత మంది భద్రా సిబ్బంది చుట్టుముట్టా రని దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.