Pradhan Mantri Awas Yojana : ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ.2.2 లక్షల కోట్లు

Update: 2024-07-24 08:45 GMT

పట్టణాల్లో ఉండే పేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు కేంద్రం బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి వచ్చే ఐదు సంవత్సరాలకు 2.2 లక్షల కోట్ల సాయాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు.

దేశంలోని గ్రామీణ, పట్టణ మధ్యతరగతి కుటుంబాల గృహనిర్మాణం కోసం ఆర్ధిక సాయం, వడ్డీ రాయితీలు కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ఈ స్కీమ్ లో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ప్రకటించిన నిధులతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

దేశంలో రెంటల్ హౌసింగ్ మార్కెట్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు, పారదర్శకత, నాణ్యతపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికులకు డార్మిటరీ తరహా వసతితో అద్దె గృహాలను నిర్మిస్తామని తెలిపారు. వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టనున్నట్ల ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశంలో 30 లక్షల జనాభా పైబడిన ఎంపిక చేసిన నగరాల్లో వీక్లీ హల్ లేదా స్ట్రీట్ ఫుడ్ హట్లను ఏర్పాటు చేయాలని ప్రాతిపాదించారు.

Tags:    

Similar News