Naveen Patnaik : రికార్డు సృష్టించిన ఒడిషా సీఎం
దేశంలోనే అత్యధిక కాలం సీఎం గా చేసిన రెండవ వ్యక్తి
బీజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు.బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కినెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. ఆయన పొలిటికల్ రికార్డ్ ఇప్పుడు చాలా పార్టీల నేతలకు రోల్ మోడల్‌గా మారింది. ఎందుకంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరుతో ఉంది.ఆయన 1994 డిసెంబర్ 12 నుంచి 2019 మే 27 వరకు అంటే 24 ఏళ్ల 166 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇక ఒడిశా C.M అయిన నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే 2000 మార్చి 5న తొలిసారి సీయం కుర్చీలో కూర్చున్నారు. ఇప్పటికీ 23 ఏళ్ల 138 రోజులుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు… 23 ఏళ్ల 137 రోజులపాటు పదవిలో కొనసాగారు. చామ్లింగ్, జ్యోతిబసు తర్వాత వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన మూడోనేత నవీన్ పట్నాయక్. ఒకవేళ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో B.J.D విజయం సాధించి పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. పదవులు, అధికారం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ తాత్కాలికమే అని చెబుతుంటారు. కాని ఆ మాటలు అందరికి వర్తించవని..కొందరు వాటికి అతీతులని నిరూపించిన మరో నేతగా మిగిలిపోయారు నవీన్ పట్నాయక్.