Assam: అసోంలో వరదలు.. 62కి చేరిన మృతుల సంఖ్య.. 30 లక్షల మందిపై.. ఎఫెక్ట్‌

Assam: ఈశాన్య భారతం వరదలతో విలవిలలాడుతోంది. అసోం, మేఘాలయ,నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో వరదలు పోటెత్తుతున్నాయి.

Update: 2022-06-19 09:45 GMT

Assam: ఈశాన్య భారతం వరదలతో విలవిలలాడుతోంది. అసోం మేఘాలయ,నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో వరదలు పోటెత్తుతున్నాయి. అసోంలో పరిస్థితి భయానంగంగా ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 62కు చేరింది. 32 రెండు జిల్లాలోలని దాదాపు 30 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారు. వరద ఉధృత వల్ల పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హోజోయ్‌ జిల్లాలో వరద ప్రభావిత ప్రజలను తీసుకెళ్తున్న బోటు మునిగి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గౌహతిలో కురుస్తున్న వర్షాలకు నగరమంతా వరద నీటితో నిండిపోయింది.

ఇప్పటికే రంగంలోకి దిగిన NDRF, SDRF సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈనెల 14 నుంచి గౌహతిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కరెంట్‌ పునరుద్ధరణకు అధికారులు రంగంలోకి దిగారు అటు బ్రహ్మపుత్ర, గౌరంగ నదులు డేంజర్‌ స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. 66వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఐఎండీ అధికారులు.

Tags:    

Similar News