ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో దసరాను భిన్నంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా జరిగే దసరాకు భిన్నంగా 75 రోజులపాటు పండగను నిర్వహిస్తారు. 600 ఏళ్లుగా బస్తర్ లోని దంతేశ్వరీ టెంపుల్ కాంప్లెక్స్ సర్హాసర్ భవన్ లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. జోగీ బిఠాయీ పేరుతో నిర్వహించే ఈ వేడుకలో తొలుత ఓ యువకుడిని సన్యాసిలా అలంకరిస్తారు. సంగీత వాయిద్యాల నడుమ పూజ చేసి నాలుగు అడుగుల లోతున ఉన్న గొయ్యిలో అతడిని కూర్చోబెడతారు. అక్కడే వివిధ రకాల పూజలు చేస్తారు. పూజలో పాల్గొన్న ఆ యువకుడు తొమ్మిది రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోడనీ....కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోడని వేడుక నిర్వాహకులు తెలిపారు. మావల్లీ పార్గవ్ గా పిలిచే రోజున పూజలో పాల్గొన్న యువకుడు బయటకు వస్తాడని చెప్పారు..