Massive Fire: టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
యజమాని సహా ఎనిమిది మంది సజీవదహనం;
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్‌లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్స్‌లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసారిగా మంటలు చెరలేగాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తం విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సుమారు ఆరు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలిపారు.
మంటల్లో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని వెల్లడించారు. మృతుల్లో ఫ్యాక్టరీ యజమానితోపాటు, అతని ఏడాదిన్నర వయస్సు కలిగిన మనవడు, ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామన్నారు. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో మంటలను అదుపుచేయడానికి 5 నుంచి 6 గంటలపాటు శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు.