8th Pay Commission : 8వ వేతన సంఘం వచ్చేసింది.. ఒక లక్ష జీతంపై ఎంత పెరుగుతుందంటే?

Update: 2025-10-29 07:30 GMT

 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. దాదాపు 1.18 కోట్ల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణంలో భారీ మార్పులు తీసుకురావడానికి 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ (ToR)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పదేళ్లకు ఒకసారి చేసే ఈ వేతన సవరణ ప్రక్రియ అధికారికంగా మొదలయింది. కొత్త వేతన స్కేల్‌లు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వేతన సంఘం సిఫార్సుల ద్వారా జీతాలు, భత్యాలు ఎంత పెరిగే అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి, 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. పది నెలలుగా ఎదురుచూస్తున్న ఈ కమిషన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ (ToR)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 1.18 కోట్ల మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కమిషన్ తన అధికారిక ఏర్పాటు జరిగిన తేదీ నుంచి 18 నెలల్లోగా తన సమగ్ర సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

కొత్త వేతన స్కేల్‌లు జనవరి 1, 2026 నుంచి వెనకటి తేదీ నుంచి అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ కమిషన్ ప్రస్తుత వేతన నిర్మాణం, భత్యాలు, పెన్షన్ ఫార్ములాను సమీక్షించనుంది. 8వ వేతన సంఘం ఇంకా తన అధికారిక వేతన నిర్మాణాన్ని ప్రకటించనప్పటికీ, అంచనాల ప్రకారం జీతాలలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ కమిషన్ 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేయవచ్చని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుత బేసిక్ సాలరీపై వర్తించే గుణకారం. గతంలో 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసింది.

ఈ అంచనా ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో నెలకు రూ. 18,000 నుండి రూ. 19,000 వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ. లక్ష బేసిక్ సాలరీ అందుకుంటున్న మధ్యస్థాయి ఉద్యోగికి, బడ్జెట్ కేటాయింపులను బట్టి జీతం ఎంత పెరగవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

14 శాతం పెరుగుదల: ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు కేటాయిస్తే, ఉద్యోగి జీతం నెలకు రూ.1.14 లక్షలకు పెరగవచ్చు.

16 శాతం పెరుగుదల: రూ.2 లక్షల కోట్ల కేటాయింపుతో, జీతం నెలకు రూ.1.16 లక్షలకు పెరగవచ్చు.

18 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల: కేటాయింపు రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుంటే, జీతం నెలకు రూ.1.18 లక్షలకు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుందని అంచనా.

అదనంగా డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, ప్రయాణ అలవెన్స్ వంటి అలవెన్సులను కూడా తిరిగి లెక్కించి పెంచుతారు.

Tags:    

Similar News