Air Force Day : చండీగఢ్‌లో ఘనంగా 90వ ఎయిర్ ఫోర్స్ డేే ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న ఎయిర్ షో..
Air Force Day : భారత వాయుసేన 90వ వార్షికోత్సవం వేడుకలు చండీగఢ్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి;
Air Force Day : భారత వాయుసేన 90వ వార్షికోత్సవం వేడుకలు చండీగఢ్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. సుమారు 80 విమానాలతో నిర్వహిస్తున్న ఎయిర్ షో విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి ఢిల్లి-NCR పరిధి అవతల నిర్వహిస్తున్న... ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి..పరేడ్‌ను పర్యవేక్షించారు. ఏయిర్‌ఫోర్స్ డే సందర్భంగా వాయుసేన.. కొత్త యూనిఫామ్‌ను విడుదల చేయనుంది.
ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఐఏఎఫ్ చీఫ్ మాట్లాడారు. చారిత్రాత్మక 'వెపన్ సిస్టమ్ బ్రాంచ్'ను రూపొందించడానికి కేంద్రం గీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త కార్యాచరణ శాఖను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారన్న ఆయన..అన్ని రకాల క్షిపణుల ప్రయోగానికి, విమానాల్లో వెపన్ సిస్టమ్ నిర్వహణకు ..' వెపన్ సిస్టమ్ బ్రాంచ్' తోడ్పతుందని తెలిపారు. అంతేగాక దీని వల్ల 3వేల 400 కోట్లు ఆదా అవుతాయన్నారు.
అటు వచ్చే ఏడాది మహిళా అగ్నివీర్లను ఎయిర్ ఫోర్సులో చేర్చుకుంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ప్రకటించారు. ప్రతీ అగ్నివీర్ ఎయిర్ ఫోర్సులో చేరడానికి ముందే సరైన నైపుణ్యాలు ఉండేలా శిక్షణాపద్దతిని మార్చామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో.. ప్రాథమిక శిక్షణ కోసం 3వేల మందిని తీసుకోనున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు, CDS, త్రివిధ దళాల అధిపతులు జాతీయ యుద్ధస్మారకాన్ని సందర్శించారు. మరోవైపు ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా.. వాయుసేన పోరాట యోధులందరికీ శుభాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్ అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించిందని కొనియాడారు. దేశాన్ని ఎల్లప్పుడూ కాపాడటమే కాకుండా.. విపత్తులు సంభవించినప్పుడు మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందని చెప్పారు.