Actre Kasthuri : మధురై కోర్టును ఆశ్రయించిన నటి కస్తూరి

Update: 2024-11-13 14:45 GMT

ప్రముఖ నటి కస్తూరి మధురై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ లంటూ పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు ప్రజ లపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి పరారీలో ఉన్నట్లు తమిళనాడు పోలీసులు ప్ర కటించిన సంగతి తెలిసిందే. వారం క్రితం.. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసు కురావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువా రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదయ్యా పోలీసులు పోయెస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందంతో ఆమె కోసం గాలిస్తున్నారు. అప్రమత్తమైన కస్తూరి ముందస్తు బెయిల్ కోసం తన న్యాయవాదుల ద్వారా మధురై కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.

Tags:    

Similar News