Adani Telecom : టెలికాం రంగంలో అంబానీతో తలపడనున్న అదానీ..
5జి స్పెక్ట్రమ్ వేలంపాటకు దరఖాస్తు చేసుకున్న అదాని గ్రూపు;
Adani Telecom : బిలియనేర్ అదానీ ఇప్పుడు టెలికాం రంగంలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 26న జరుగనున్న 5జి స్పెక్ట్రమ్ వేలంపాటకి అదానీ గ్రూపు దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అదానీ గ్రూపు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అదానీ టెలికాంలో అడుగుపెడితే.. ప్రధాన పోటీ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునిల్ భారతి మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్‌తో ఉండనుంది.
భారతదేశంలో అంబానీ, అదానీ.. ఈ ఇద్దరు కుబేరులు ఇప్పటివరకు ఒకరిపై ఒకరు తలపడి వ్యాపారం చేయలేదు. మొదటి సారి టెలికాం రంగంలో అదానీ కూడా అడుగుపెట్టి అంబానీతో తేల్చుకోబోతున్నాడు. 5జీ స్పెక్ట్రమ్ వేలం జులై 26 నుంచి మొదలు కానుంది. దీని విలువ సుమారు 4.3 లక్షల కోట్ల వరకు ఉంటుంది. వేలంపాటకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఈ నెల 12న విడుదల చేస్తారు. ఏ కుబేరుడు ఈ వేలంపాటను గెలుచుకోబుతున్నారనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.