Air Pollution : రాజధానిలో కొనసాగుతున్న వాయు కాలుష్యం..
శ్వాసకోశ సమస్యలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉన్నది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో ఆదివారం సైతం కాలుష్యం కొనసాగింది. ఆదివారం ఉదయం 7 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) డేటా ప్రకారం.. చాలా ప్రాంతాల్లో వాయువ నాణ్యత సూచి (AQI) 400 మార్క్‌ను దాటింది. నోయిడా, ఘజియాబాద్‌లో సైతం కాలుష్యం పెరిగింది. ఏక్యూఐ ఆనంద్ విహార్‌లో 429గా నమోదు కాగా.. అశోక్ విహార్‌లో 420, ఆయానగర్‌లో 339గా ఉన్నది. బవానాలో కాలుష్య స్థాయిలు 432, బురారిలో 402, డీటీయూ ప్రాంతంలో 399, ద్వారకలో 386, ఐటీవో 388గా ఉంది. జహంగీర్‌పురిలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నది.
ఇక్కడ ఏక్యూఐ 437 వద్ద నమోదైంది. ముండ్కాలో 413, నజాఫ్‌గఢ్‌లో 338, పంజాబీ బాగ్‌లో 412, రోహిణిలో 438కి చేరుకుంది. ఆర్‌కేపురంలో 396గా ఉండగా వజీర్‌పూర్‌లో 448గా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా ఉన్నది. సాధారణ ప్రజలు ప్రతికూల వాతావరణంతో తీవ్రమైన సమస్యల బారినపడే అవకాశం ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం, లోనీలో 464 ఏక్యూఐగా నమోదైంది. సంజయ్ నగర్‌లో 389, ఇందిరాపురంలో 421కి చేరింది. నోయిడాలోని అనేక ప్రాంతాలలో 400 కంటే ఎక్కువ నమోదవుతున్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం.. సెక్టార్ 125లో 436, సెక్టార్-1లో 388, సెక్టార్ 62లో 370, సెక్టార్ 116లో 388గా చేరింది. గురుగ్రామ్‌లోని ఎన్‌ఐఎస్‌ఈ గ్వాల్ పహారీలో 325, సెక్టార్ 51లో 324, తేరి గ్రామ్ 212, వికాస్ సదన్‌లో 287గా ఉన్నది.