Delhi : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

Update: 2024-11-16 09:45 GMT

దేశరాజధానిలో నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి ఉందని అక్కడి వైద్య, వాతావరణ నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలంపాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది.వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జ్వరం తదితరాలతో అల్లాడుతున్నారు. 

Tags:    

Similar News