దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఎన్‌సీఆర్‌లో ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది.
ఇక, గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు అని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదికలో తేలింది. ఆనంద్ విహార్‌లో గాలిలో నాణ్యత 339, ద్వారకలో 325గా ఉంది. ఢిల్లీలో గాలి కాలుష్యం పెరిగిపోవడంతో దీపావళికి టాపాసులపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది.