Amarnadh yatra: గుండెపోటుతో యాత్రికుల మృతి
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో ఒక రోజు వ్యవధిలో ఐదుగురు యాత్రికులు గుండెపోటుతో మృతిచెందారు.;
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో ఒక రోజు వ్యవధిలో ఐదుగురు యాత్రికులు గుండెపోటుతో మృతిచెందారు.మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.దీంతో అమర్‌నాథ్ యాత్రలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ఐదుగురు యాత్రికులు మృతిచెందినట్లు తెలిపారు అధికారులు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో జరిగే ఈ యాత్రకు వెళ్లిన వారిలో, ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. తాజాగా మృతి చెందిన ఐదుగురిలో, అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు గాందర్‌బల్ జిల్లా బల్తాల్ మార్గంలో ఇద్దరు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉండగా మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.