Amazon: రూ.2000 నోట్ల విషయంలో కీలక నిర్ణయం..
నోట్లను మార్చుకునేందుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రకటన;
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీల సమయంలో రూ.2000 నోట్లను తీసుకోరాదని నిర్ణయించింది. రూ.2000 నోట్లను రద్దు చేసిన తరువాత ఆ పెద్ద నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ గడువు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండడంతో, అమెజాన్ తాజా ప్రకటన చేసింది.
మనం దుకాణాలకు వెళ్లి వస్తువులు కొనేరోజులు ఎప్పుడో పోయాయి. ఇల్లు, ఆఫీస్ లో కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేస్తున్నారు. అయితే కేంద్రం కేంద్రం పెద్ద నోట్లు బ్యాన్ చేసిన తర్వాత అందరూ సులువుగా అయిపోతుంది కదా అని ఆన్లైన్లో షాపింగ్ చేయడం కాష్ ఆన్ డెలివరీ పెట్టడం రూ. 2000 నోటును వారికి ఇచ్చి మార్చుకోవడానికి మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు అమెజాన్ ఓ కీలక అప్‌డేట్ ప్రకటించింది. ఇకపై ఆన్‌లైన్‌లో ఏ ప్రొడక్టు కొనుగోలు చేసినా.. రూ.2000 నోట్లు ఇస్తే డెలివరీ బాయ్స్ యాక్సెప్ట్ చేయరు. ఈ విషయం అందరికి తెలిసేలా ఒక ప్రకటనను విడుదల చేసింది. డెలివరీ సమయంలో రూ. 2000 నోట్లను ఇచ్చే వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్ ఆ నోట్లను తీసుకోరని స్పష్టం చేసింది. ఎవరైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ను ఎంచుకుంటారో వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిగిలిన డినామినేషన్లలోని నోట్లును ఇవ్వాలని అమెజాన్ తెలిపింది.
అయితే ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 19, 2023 నుంచి అమలు చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. అప్పటి వరకు రూ. 2000 నోట్ల చెల్లింపులను అమెజాన్ యాక్సప్ట్ చేయనుంది. అలాగే ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నట్లైతే, అలాంటి సందర్భంలో కూడా రూ. 2000 నోట్లను యాక్సప్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
కేంద్రం రూ.2000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెద్ద నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ గడువు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండడంతో, అమెజాన్ తాజా ప్రకటన చేసింది. మే నెల నుంచి రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించగా, ఇప్పటివరకు రూ.3.32 లక్షల కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయినట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.