Ambani Wedding Invitation : కొడుకు ఖరీదైన పెళ్లి ఆహ్వానాలు పంపుతున్న అంబానీ ఫ్యామిలీ

Update: 2024-06-28 04:50 GMT

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ( Mukesh Ambani ) బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేను ఆయన నివాసంలో కలిశారు. జులై 12న జరగనున్న తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరుకావాలని ముకేశ్ సీఎంను ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శిందేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం కుటుంబసభ్యులు రాధికా మర్చంట్కు వినాయకుడి ప్రతిమను బహూకరించారు. ఈ ఖరీదైన పెళ్లి ఆహ్వాన బహుమతి వీడియో వైరల్ అవుతోంది.

కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సోమవారం ముంబయిలోని అజయ్ దేవగన్ ఇంటికి వెళ్లి తమ వివాహానికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ "మన సంప్రదాయం ప్రకారం ముందుగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటా ము. భగవంతుడికి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించాను. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కాశీ విశ్వనాథ్ కారిడార్, నమో ఘాట్, సోలార్ ఎనర్జీ ప్లాంట్లు, పరిశుభ్రతను చూస్తుంటే సంతోషంగా ఉంది" అని తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం జులై 12న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 2022లో రాజస్థాన్లోని నాథ్ ద్వారా పట్టణంలోని శ్రీనాథేజీ ఆలయంలో వీరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవల మార్చి 1 నుంచి 3 వరకు జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.

Tags:    

Similar News